కోలీవుడ్ అగ్ర కథానాయకులు కమల్‌హాసన్, విజయ్‌తో వరుసగా సినిమాలు చేసి, బ్లాక్‌బస్టర్ విజయాలు తన ఖాతాలో వేసుకున్నారు దర్శకుడు లోకేశ్ కనగరాజ్. ఇటీవల విజయ్‌తో చేసిన ‘లియో’ తర్వాత, రజనీకాంత్ కథానాయకుడిగా ఓ సినిమా చేయనున్నారు. ప్రస్తుతం టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో తన 170వ చిత్రం చేస్తున్న రజనీ, 171వ చిత్రాన్ని లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో చేయనున్నారు. ఈ సినిమా జూన్‌లో ప్రారంభం కాబోతుందని సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న లోకేశ్ చెప్పారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయనీ, దానికి దాదాపు ఆరు నెలలపాటు సమయం పడుతుందని ఆయన వెల్లడించారు. రజనీతో సినిమా పూర్తయిన తర్వాత నెల రోజులకే ‘ఖైదీ 2’ చిత్రాన్ని మొదలు పెడతానని అన్నారు. కార్తి కథానాయకుడిగా లోకేశ్ తెరకెక్కించిన ‘ఖైదీ’ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.