సొట్టబుగ్గల సుందరి తాప్సీ పెళ్లి పీటలెక్కుతోందంటూ కొంత కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ తాప్సీ తన ప్రియుడు మథియాస్ బో ను రెండు రోజుల క్రితం పెళ్లాడారు. డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో పదేళ్లుగా డేటింగ్లో ఉన్నారు తాప్సీ. పెద్దలను ఒప్పించి సిక్కు, క్రిష్టియన్ సంప్రదాయాల ప్రకారం వీరిద్దరూ ఉదయ్‌పూర్‌లో పెళ్లి చేసుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా జరిగిన ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులే హాజరయ్యారు. అయితే తన పెళ్లి విషయాన్ని తాప్సీ ఇంతవరకు వెల్లడి చేయలేదు, ఫొటోలు కూడా రిలీజ్ చేయలేదు. కాగా, 2013లో జరిగిన ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ ప్రారంభ కార్యక్రమంలో మొదటిసారి వీళ్లిద్దరూ కలుసుకున్నారు. అక్కడి నుంచే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. నటి తాప్సీ ఎప్పటికప్పుడు వారి ప్రేమాయణంపై మీడియా అడిగిన ప్రశ్నలను దాటేసేవారు. తమ ప్రేమ బంధాన్ని ఎంతో గోప్యంగా ఉంచిన తాప్సీ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో మథియా్సతో తన పరిచయం గురించి తొలిసారిగా వెల్లడించారు.