ఇటు రావే నా గాజు బొమ్మా
నేనే నాన్నా అమ్మా
ఎద నీకు ఉయ్యాల కొమ్మా
నిన్ను ఊపే చెయ్యే ప్రేమా
వాలిపో ఈ గుండెపైనే
ఆడుకో ఈ గూటిలోనే
దూరం పోబోకుమా
చిన్ని చిన్ని పాదాలని
నేలై నే మోయనా
చిందే క్షణంలో
నువ్వు కిందపడిన
ఉంటావు నా మీదనా
నీ చెంతే రెండు
చెవులుంచి బయలెల్లనా
ఏ మాట నీ నోట మోగించిన
వెనువెంటే వింటానే
రానా నిమిషంలోనా
నే నన్నే వదిలేసైనా
తుళ్ళే తుళ్ళే నీ శ్వాసకి
కాపై నేనుండనా
ఉఛ్వాసనైనా నిశ్వాసనైనా
మేలెంచి పంపించనా
ఏ కాంతులైన అవి నన్ను దాటకనే
ఆ రోజు చేరాలి నీ చూపునే
నీ రెప్పై ఉంటానే
పాప కంటి పాప
నా పాప కంటిపాపా
ఇటు రావే నా గాజు బొమ్మా
నేనే నాన్నా అమ్మా
ఎద నీకు ఉయ్యాల కొమ్మా
నిన్ను ఊపే చెయ్యే ప్రేమా
వాలిపో ఈ గుండెపైనే
ఆడుకో ఈ గూటిలోనే
దూరం పోబోకుమా