ఆర్ఎన్ హర్షవర్ధన్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'చిత్రం చూడరా' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా యొక్క డిజిటల్ రైట్స్ ని ఈటీవీ విన్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.
ఈ చిత్రంలో అల్లరి రవిబాబు, తనికెళ్ల భరణి, రాజా రవీంద్ర, శివాజీరాజా, శీతల్ భట్, మీనా కుమారి, అన్నపూర్ణమ్మ, ధన్‌రాజ్, కాశీ విశ్వనాథ్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బిఎమ్ సినిమాస్ బ్యానర్‌పై శేషు మారంరెడ్డి, బోయపాటి భాగ్యలక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మించారు. ధన తుమ్మల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి రాధన్ సంగీతం అందిస్తున్నారు.