మహేష్ బాబు కొరటాల శివ కలయికలో ఓ సినిమా తెరకెక్కు తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇక్కడ ప్రత్యేకంగా వేసిన సీఎం క్యాంప్ ఆఫీస్ సెట్ లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ షూటింగ్ వచ్చేనెల 7వ తేదీ వరకూ జరగనుంది .ప్రస్తుతం పొలిటికల్ సినిమాల జోరు కొనసాగుతుంది. దర్శకుడు తేజ ‘నేనే రాజు నేనే మంత్రి’తో ఓ పొలిటికల్ డ్రామా చూపించాడు. కొరటాల శివ ఇప్పుడు ‘భరత్ అను నేను’ లో కూడా పాలిటిక్స్ ను టచ్ చేస్తున్నాడు. మహేష్ బాబు ఇందులో ముఖ్యమంత్రిగా కనిపిస్తాడని తెలిసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa