‘హీరామండి’ షూటింగ్ సమయంలో డిప్రెషన్‌కు వెళ్లినట్లు నటి మనీషా కొయిరాలా తాజాగా వెల్లడించారు. క్యాన్సర్ బారిన పడడంతో కొన్నేళ్లపాటు విరామం తీసుకున్నారు. ఇటీవల ‘హీరామండి’ వెబ్ సిరీస్‌లో మల్లికాజాన్‌గా తన నటనతో ఆకట్టుకున్నారు. ’’షూటింగ్ సమయంలో సడెన్‌గా ఆలోచనలు మారిపోయేవి. మూడ్ స్వింగ్స్ ఎక్కువయ్యాయి. దర్శకుడు సంజయ్ 12 గంటలు కాగానే నా పాత్ర చిత్రీకరణ నిలిపేసేవారు. నన్ను ఆయన బాగా అర్థం చేసుకున్నారు’ అని మనీషా చెప్పారు.