సాజిద్ నడియాడ్వాలా హిందీ చిత్రసీమలో ప్రముఖ నిర్మాత అతను తరచుగా సౌత్ చిత్రాలను హిందీలో రీమేక్ చేస్తూ ఉంటారు. ఆర్ఎక్స్ 100 రీమేక్‌తో అహా శెట్టిని ఇండస్ట్రీ కి పరిచయం చేసారు. అయితే ఆ చిత్రం ఫ్లాప్‌గా ముగిసింది.
ఇప్పుడు తాజాగా మరో సినిమా ‘సాంకి’ చేస్తున్నాడు. అది త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ చిత్రం తమిళంలో జయం రవి నటించిన అడంగ మారు చిత్రానికి రీమేక్ అని వార్తలు వస్తున్నాయి.
అయితే ఇప్పుడు ఈ సినిమా తమిళంలో హిట్ అయిన సినిమాకి రీమేక్ కాదని, తెలుగు సినిమాకి రీమేక్ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నట్లు సమాచారం.