లోక్ సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ ముంగిట సినీ నటి రష్మిక మందన్నా సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. ఏ పార్టీ పేరునూ ప్రస్తావించని ఆమె.. అభివృద్ధికి ఓటేయండంటూ ఆమె తన ఫాలోవర్లకు పిలుపునిచ్చారు. భారత్‌లోనే అతిపెద్ది సీ లింక్ బ్రిడ్జ్‌గా గుర్తింపు పొందిన ముంబైలోని ‘అటల్ సేతు’పై నుంచి మాట్లాడిన రష్మిక.. మీ కళ్లు తెరవండి అంటూ వీడియోలో మాట్లాడారు. 22 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ ఆరు లేన్ల వంతెన ప్రయాణ సమయాన్ని 2 గంటల నుంచి కేవలం నిమిషాలకు తగ్గిస్తుందని ఆమె చెప్పారు. భారత్ పెద్ద కలలు కలలేదన్నారు కానీ.. కేవలం ఏడేళ్లలోనే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారన్నారు. అటల్ సేతుతో వికసిత భారత్‌కి ద్వారాలు తెరుచుకున్నాయన్న రష్మిక.. ఇది కేవలం బ్రిడ్జి కాదు మన యువ భారత్‌కు గ్యారంటీ అన్నారు. ఇలాంటి వందలాది అటల్ సేతులు నిర్మించాలంటే.. మేల్కొని డెవలప్‌మెంట్‌కు ఓటేయాలని రష్మిక పిలుపునిచ్చారు. సౌతిండియా టు నార్త్ ఇండియా, వెస్ట్ ఇండియా టు ఈస్టిండియా.. కనెక్టింగ్ హార్ట్స్.. మై ఇండియా అంటూ ఆమె ఈ వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఏ పార్టీకి ఓటేయాలో చెప్పనప్పటికీ.. ఆమె ఎవరి కోసం ఈ వీడియో చేసిందో నెటిజన్లకు క్లియర్‌గానే అర్థమైంది.ఇక ఈ ట్వీట్ పై ప్రధాని మోదీ స్పందించారు. ఆయన రిప్లై ఇస్తూ..."ఖచ్చితంగా! ప్రజలను కనెక్ట్ చేయడం మరియు జీవితాలను మెరుగుపరచడం కంటే సంతృప్తికరమైనది మరొకటి లేదు." అన్నారు.