ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మనమే' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా మెగా హీరో

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 03, 2024, 07:13 PM

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టాలీవుడ్ నటుడు శర్వానంద్ ఒక  కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'మనమే' అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఈ సినిమా జూన్ 7, 2024న విడుదలకి సిద్ధంగా ఉంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో శర్వాకి జోడిగా కృతి శెట్టి నటిస్తుంది. విలక్షణమైన కథాంశంతో వస్తున్న ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa