ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'వాట్ ది ఫిష్‌' లో జాన్సన్ కీలక పాత్ర

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 03, 2024, 07:15 PM

నూతన దర్శకుడు వరుణ్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'వాట్ ది ఫిష్' అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో జాన్సన్ జాన్ ఫ్రై అనే పాత్రలో నటిస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ నటుడి యొక్క క్యారెక్టర్ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ సినిమాలో నిహారిక కొణిదెల, సుస్మితా ఛటర్జీ కీలక పాత్రలో నటిస్తున్నారు. శక్తికాంత్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నారు. 6ix సినిమాస్ బ్యానర్‌పై విశాల్ బెజవాడ మరియు సూర్య బెజవాడ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa