సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 2019లో బ్లాక్‌బస్టర్ మూవీస్ లో ఒకటైన పుష్ప: ది రైజ్‌కి సీక్వెల్ గా పుష్ప 2: ది రూల్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమాలోని సెకండ్ సింగల్ ని ది కపుల్ సాంగ్ ని సూసేకిఅనే టైటిల్ తో విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ 4 భాషల్లో ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అయిన మొట్టమొదటి ఆడియోగా నిలిచినట్లు సమాచారం. ఈ విషయాన్ని చిత్ర బృందం ఆన్లైన్ లో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ సినిమా ఆగష్టు 15, 2024న విడుదల కానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక మందన్న నటిస్తుండగా, ఫహద్ ఫాసిల్ భన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీసాఫీసర్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్, సునీల్, జగదీష్ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పుష్ప 2ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa