ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'తంగలన్' గురించిన లేటెస్ట్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 04, 2024, 10:10 AM

దర్శకుడు పా రంజిత్‌తో స్టార్ హీరో విక్రమ్ 'తంగలన్' సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాపై ప్రేక్షకులకి భారీ అంచనాలు ఉన్నాయి. లేటెస్ట్ రిపోర్ట్స్  ప్రకారం, ఈ సినిమాని మూవీ మేకర్స్ జులైలో విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. రానున్న రోజులలో మూవీ మేకర్స్ అధికారక విడుదల తేదీని ప్రకటించనున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్ మరియు పార్వతి తిరువోతు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో డేనియల్ కాల్టాగిరోన్, పశుపతి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు. నీలం ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa