ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'దేవర' సీక్వెల్‌లో భాగం కానున్న ప్రముఖ హీరోయిన్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 04, 2024, 04:21 PM

కొరటాల శివ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక చిత్రాన్ని ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఈ పాన్-ఇండియన్ చిత్రానికి 'దేవర' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం అక్టోబర్ 10న విడుదల కానుంది అని మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జోడిగా నటిస్తుంది. అయితే ఈ సీక్వెల్‌లో మరో ప్రముఖ కథానాయికను తీసుకోవచ్చని ఫిల్మ్ సర్కిల్స్‌లో గాసిప్‌లు వినిపిస్తున్నాయి. ఈ వార్త ఇంకా ధృవీకరించబడనప్పటికీ సోషల్ మీడియాలో ఈ వార్త హల్‌చల్ చేస్తుంది. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, శృతిమరాఠే, తారక్ పొన్నప కీలక పాత్ర పోషిస్తున్నారు. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి యువసుధ ఆర్ట్స్ బ్యానర్ ఎ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa