ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ షో

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 07, 2024, 02:47 PM

రకుల్ ప్రీత్ సింగ్ కి తిరుగులేదు అన్నట్లుగా ఒకప్పుడు ఆమె హవా సాగింది. కానీ ఇప్పుడు రకుల్ కి అవకాశాలు తగ్గాయి. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది.రకుల్ ప్రీత్ సింగ్ కి తిరుగులేదు అన్నట్లుగా ఒకప్పుడు ఆమె హవా సాగింది. కానీ ఇప్పుడు రకుల్ కి అవకాశాలు తగ్గాయి. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది. ఇటీవల రకుల్ కి ఆఫర్స్ తగ్గినప్పటికీ అభిమానుల్లో ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో రకుల్ ఎప్పుడూ తన గ్లామర్ పిక్స్ తో సర్ ప్రైజ్ లు ఇస్తూనే ఉంటుంది. రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడూ అందంగా కనిపించేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. తాజాగా రకుల్ కళ్ళు చెదిరే స్టైలిష్ లుక్ లో మెరిసింది. జీన్స్ ప్యాంట్, టీషర్ట్ ధరించిన రకుల్ గ్లామర్ లుక్ కి యువత ఫిదా అవుతున్నారు. రకుల్ మోడ్రన్ డ్రెస్సుల్లో అయినా ట్రెడిషనల్ డ్రెస్సుల్లో అయినా తనకి తిరుగులేదు అని మరోసారి నిరూపించుకుంది. రకుల్ రీసెంట్ గా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 21న రకుల్ తన ప్రియుడు జాకీ భగ్నానీని గోవాలో పెళ్లి చేసుకుంది. ఎంతో గ్రాండ్ గా వీళ్లిద్దరి వివాహ వేడుక జరిగింది. 


రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో ఎన్టీఆర్, రాంచరణ్, బన్నీ, మహేష్ లాంటి స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. సరైనోడు, ధృవ, నాన్నకు ప్రేమతో లాంటి హిట్స్ ని ఖాతాలో వేసుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ తో, నటనతో సౌత్ లో స్టార్ గా ఎదిగింది. ఆ మధ్యన డ్రగ్స్ కేసు వివాదం కూడా రకుల్ ని ఇబ్బంది పెట్టింది. ప్రస్తుతం రకుల్ తన సినిమాలపై ఫోకస్ పెడుతూ బాలీవుడ్ లో రాణించే ప్రయత్నం చేస్తోంది. 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa