డిఫరెంట్ కంటెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అవుతున్నారు నూతన దర్శకనిర్మాతలు. ఎప్పటికప్పుడు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా వెండితెరపై సరికొత్తగా కథలను ఆవిష్కరిస్తున్నారు. తాజాగా అలా ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ జానర్‌లో వస్తున్న సినిమానే ప్రణయగోదారి. పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రముఖ కమీడియన్ అలీ ఫ్యామిలీ నుంచి వచ్చిన నటుడు సదన్ హీరోగా నటిస్తున్నాడు. ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా నటిస్తోండగా పిఎల్‌వి క్రియేషన్స్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా పారమళ్ళ లింగయ్య ఈ ‘ప్రణయగోదారి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేస్తు మరోవైపు జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను, PLV క్రియేషన్స్ బ్యానర్ లోగోను తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రిలీజ్ చేశారు. చిత్ర యూనిట్ మొత్తానికి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. కార్యక్రమంలో మంత్రి వెంట జడ్పిటిసి సురేందర్ రెడ్డి ఉన్నారు. తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్‌ను చూస్తే.. ఈ సినిమా ప్రేక్షకులకు డిఫరెంట్ అనుభూతి కలిగించే కథతో వస్తోందని అర్థమవడమే కాక టైటిల్‌కి తగ్గట్టుగా నాచురల్ లొకేషన్స్ లో సీన్స్ చిత్రీకరించారని తెలుస్తోంది. పోస్టర్ లో గోదారి అందాలు, అక్కడి ప్రజల జీవన విధానాలు ప్రస్ఫుటం అవుతున్నాయి. నది ఒడ్డున హీరో హీరోయిన్ సైకిల్ పై ప్రయాణం చేస్తూ ప్రేక్షకుల ఆకర్షించేలా ఉంది. మార్కండేయ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఈదర ప్రసాద్ కెమెరామెన్ గా పని చేస్తున్నారు. చీఫ్ కో డైరెక్టర్ గా జగదీశ్ పిల్లి, డిజైనర్ గా TSS కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ గా గంట శ్రీనివాస్ వర్క్ చేస్తున్నారు. కొరియోగ్రఫర్స్ కళాధర్ , మోహనకృష్ణ , రజిని, ఎడిటర్ కొడగంటి వీక్షిత వేణు, ఆర్ట్ విజయకృష్ణ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa