ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రితికా సింగ్‌ గురించి ప్రత్యేకకథనం

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 17, 2024, 01:26 PM

రితికా సింగ్‌ అంటే  ‘గురు’ సినిమా గుర్తొస్తుంది. ఆమె హీరోయిన్‌ కాకముందు.. కరాటేలో బ్లాక్‌బెల్ట్‌. కిక్‌ బాక్సర్‌గా రాణించింది. ఈ అమ్మడి గురించి కొన్ని విశేషాలు... కర్లీ హెయిర్‌ కథానాయిక... జిమ్‌ ఫొటోలతో, వీడియోలతో అలరిస్తుంటోంది. రితికా సింగ్‌ పూర్తి పేరు రితికా మోహన్‌ సింగ్‌. తన ఇన్‌స్టా పేజీకి 44 లక్షల మంది ఫాలోవర్లున్నారు. తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను ఇన్‌స్టాలో షేర్‌ చేస్తుంది రితికా. డ్యాన్సు వీడియోలు, మాస్కుతో పబ్లిక్‌లోకి వెళ్లి రైల్లో ప్రయాణం చేయటం.. లాంటివి చేస్తుంటుంది. ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉండటం.. చిన్నప్పటి నుంచే అలవడిందట. ‘మేము ముంబైలోని అవుట్‌కట్స్‌లో ఉండేవాళ్లం. కాలేజీకి వెళ్లటానికి రెండు గంటల సమయం పట్టేది మెట్రోలో. ఎక్కువగా కాలేజీ క్లాసులో కూర్చోలేకపోయేదాన్ని. ఎందుకంటే కరాటేనే నా ప్రపంచం. మూడేళ్ల వయసులో కరాటే నేర్చుకోవటం ప్రారంభించా. మా నాన్న, తాతయ్యలు కరాటే, బాక్సింగ్‌ ఫీల్డ్‌నుంచి వచ్చారు. కాబట్టి నాకు అబ్బింది. మా అన్న కూడా మార్షల్‌ ఆర్ట్స్‌లో ఉన్నారు. ఉదయాన్నే లేవటం.. వ్యాయామం చేయటం చేసేదాన్ని. మా నాన్నే నాకు స్ఫూర్తి. ఇకపోతే కాలేజీ రోజుల్లో స్పోర్ట్స్‌ నా మొదటి ప్రయారిటీ. నాకెవరూ స్నేహితులు కూడా ఉండేవాళ్లు కాదు. స్నేహితులు లేకపోవటం వల్ల బాధపడేదాన్ని. నేను చదువలను నెగ్లెట్‌ చేయలేదు. డిగ్రీ చదివా. చేసే పనిలో వందశాతం ఇవ్వాలి’ అని అనుకుండేదాన్ని. రితికా సింగ్‌ నెగటివ్‌గా ఆలోచించే వాళ్లకు దూరంగా ఉండేదట. ఎవరూ మనకు ఏమీ చెప్పరు. తప్పులనుంచే తెలుసుకోవాలి. జీవితానుభవాలకు మించిన పాఠాలు ఉండవంటూ చెబుతుంది. అప్పుడప్పుడూ.. మోడివేషన్‌ స్పీకర్‌గా తన జీవిత విశేషాలను విద్యార్థులకు చెబుతుంటుందీమె.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com