ప్రభాస్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కాగా కల్కి 2829 AD వసూళ్ళు రూ. 1000 కోట్ల దిశగా పరుగులు పెడుతున్నాయి. ఓవర్సీస్ లో కల్కి చిత్రానికి భారీ ఆదరణ దక్కడం విశేషం. యూఎస్ లో కల్కి $ 15 మిలియన్ వసూళ్లు దాటేసింది. అక్కడ ప్రభాస్ నటించిన నాలుగు చిత్రాలు వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం. దర్శకుడు నాగ్ అశ్విన్ మైథాలజీ-సైన్స్ ఫిక్షన్ మిళితం చేసి కల్కి తెరకెక్కించారు. వైజయంతీ మూవీస్ దాదాపు రూ. 600 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించారు. కల్కి పార్ట్ 2 మరింత అద్భుతంగా ఉంటుందని నాగ్ అశ్విన్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. రెండు వారాలు గడుస్తున్నా బాక్సాఫీస్ వద్ద కల్కి వసూళ్లు స్ట్రాంగ్ గా ఉన్నాయి. పోటీ లేకపోవడం కూడా కల్కి చిత్రానికి కలిసొచ్చింది. కాగా కల్కి ఓటీటీ విడుదల తేదీ ఇదే అంటూ ఓ వార్త తెరపైకి వచ్చింది. కల్కి డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఫ్యాన్సీ ధర చెల్లించి దక్కించుకుంది. ఈ క్రమంలో థియేటర్స్ లో విడుదలైన 7-8 వారాల్లో ఓటీటీలో విడుదల చేసేలా ఒప్పందం కుదిరిందట. దాని ప్రకారం ఆగస్టు 15న కల్కి ఓటీటీలో అందుబాటులోకి వస్తుందని టాక్. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖం గా వినిపిస్తోంది.
కల్కి మూవీలో ప్రభాస్ భైరవ రోల్ చేశాడు. అందమైన ప్రపంచం కాంప్లెక్స్ కి ఎలాగైనా వెళ్లాలనే కలలు కనే యువకుడు పాత్ర చేశాడు. దర్శకుడు ఒకింత ఫన్నీగా ప్రభాస్ రోల్ డిజైన్ చేశాడు. అలాగే ప్రభాస్ పాత్ర నెగిటివ్ షేడ్స్ కలిగి ఉండటం విశేషం. ఇక హీరోకి సమానమైన పాత్రలో నటించాడు అమితాబ్ బచ్చన్. అశ్వద్ధామగా ఆయన ప్రెజెన్స్ సినిమాకు హైలెట్. భైరవ-అశ్వద్ధామ తలపడే పోరాట సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. కమల్ హాసన్, దీపికా పదుకొనె సైతం కథలో అత్యంత కీలకమైన పాత్రలు చేశారు. జూన్ 27న కల్కి వరల్డ్ వైడ్ విడుదల చేశారు. కల్కి సక్సెస్ నేపథ్యంలో ఆడియన్స్ కల్కి పార్ట్ 2 కోసం ఎదురుచూస్తున్నారు. కొంత మేర షూటింగ్ జరుపుకున్న కల్కి పార్ట్ 2 విడుదలకు చాలా సమయం పడుతుందని నాగ్ అశ్విన్ వెల్లడించాడు.