అనంత్ అంబానీ-రాధికా మర్చెంట్ వివాహ వేడుకకు హాజరుకాకపోవడంపై హీరోయిన్ తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'నిజం చెప్పాలంటే వాళ్లు నాకు వ్యక్తిగతంగా తెలియదు. పెళ్లి అనేది ఎన్నో అనుబంధాలతో కూడుకున్నది. ఆతిధ్యం ఇచ్చే కుటుంబానికి అతిథికి మధ్య కనీసం ఏదో ఒకరకమై అనుబంధం ఉండాలని నేను భావిస్తా. అలాంటి వివాహాలకు మాత్రమే హాజరవుతాను' అని తాప్సీ చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం తాప్సీ మూడు చిత్రాల్లో నటిస్తున్నారు.