కొందరు నెటిజన్లు ఉద్దేశపూర్వకంగా అల్లు అర్జున్‌ను ట్రోల్ చేస్తున్నారని.. అలా చేయొద్దని కమెడియన్ ఆది అన్నారు.అశ్విన్‌బాబు, దిగంగనా సూర్యవంశీ జంటగా నటించిన 'శివం భజే' ట్రైలర్ రిలీజ్‌కు హాజరైన ఆది.. అల్లు అర్జున్ గురించి మాట్లాడారు. 'అల్లు అర్జున్ నేషనల్ అవార్డు విన్నర్. ఆయన్ని అందరూ గౌరవించాలి. మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే. కొంతమంది అల్లు అర్జున్‌ను ఉద్దేశపూర్వకంగా ట్రోల్ చేస్తున్నారు. థంబ్ నెయిల్స్ పెడుతున్నారు. దయచేసి అలా చేయొద్దు. ఇకనుంచైనా ఇలాంటివి ఆపేయాలని మానస్ఫూర్తిగా కోరుతున్నా' అని అన్నారు.
పవన్ కల్యాణ్ అంటే తనకెంతో ఇష్టమని ఆది అన్నారు. ఆయన సంతోషంగా ఉంటే దూరం నుంచి చూసి ఆనందిస్తానని.. బాధలో ఉంటే దగ్గరకెళ్లి చూసుకుంటానని చెప్పారు. పవన్ కల్యాణ్ కోసమే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానన్నారు. తనకు ఎమ్మెల్సీ ఇస్తారంటూ జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa