ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంజలి బోల్డ్ కామెంట్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 26, 2024, 12:33 PM

ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ జీ 5లో అంజ‌లి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ‘బహిష్కరణ’ జీ 5లో జూలై 19 నుంచి స్ట్రీమింగ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.ఈ వెబ్ సిరీస్ లో అంజలి తొలిసారి బోల్డ్ గా నటించింది. రా అండ్ ర‌స్టిక్ డ్రామాకు ప్రేక్ష‌కులతో పాటు విమ‌ర్శ‌కుల నుంచి కూడా చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. సిరీస్‌లో ఎమోష‌న‌ల్ స‌న్నివేశాలు, అంజ‌లి స‌హా ఇత‌ర న‌టీనట‌లు ప‌నితీరుని అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు. అంజ‌లి విష‌యానికి వ‌స్తే, ఇందులో ఆమె పుష్ప అనే వేశ్య పాత్ర‌లో న‌టించింది. ఆ పాత్ర‌లో ఆమె న‌ట‌న‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ఈ వెబ్ సిరీస్ కి సక్సెస్ ఫుల్ రెస్పాన్స్ రావడంతో వెబ్ సిరీస్ టీం స్పందించింది. అంజలి తన అనుభవాలని పంచుకున్నారు. పుష్ప పాత్ర‌కు వ‌స్తోన్న రెస్పాన్స్‌పై అంజ‌లి స్పందిస్తూ.. బహిష్కరణ సిరీస్‌లో పుష్ప పాత్ర‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తుంది. రా అండ్ ర‌స్టిక్ రోల్‌లో న‌టించ‌టాన్ని ఎంజాయ్ చేశాను. ఎందుకంటే పుష్ప పాత్ర‌లో చాలా డెప్త్ ఉంది. ఆమె పాత్ర‌లో భావోద్వేగాలను చాలా శ‌క్తివంతంగా చూపించారు అని అన్నారు.ర‌స్టిక్ డ్రామాగా రూపొందిన ‘బహిష్కరణ’ అందులోని పుష్ప పాత్ర‌లోని భావోద్వేగాలు ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయ్యాయి. పాత్రకు త‌గ్గ‌ట్లు కొన్ని బోల్డ్ సీన్స్‌లో అంజ‌లి న‌టించారు. దీనిపై ఆమె మాట్లాడుతూ ప్రారంభంలో బోల్డ్ సీన్స్‌లో న‌టించ‌టం కాస్త ఇబ్బందిగా అనిపించింది. అలాంటి పాత్ర‌లు చేయ‌టం నాకు చాలెంజింగ్‌గా అనిపించింది. బోల్డ్ సీన్‌లో న‌టించిన త‌ర్వాత ఓసారైతే చాలా ఎమోష‌న‌ల్ అయ్యాను. అందుకు కార‌ణం, అలాంటి స‌న్నివేశంలో తొలిసారి నేను న‌టించ‌ట‌మే కారణం. బోల్డ్ సన్నివేశంలో నటించటానికి ముందుగా సన్నద్ధం కాలేదు. అయితే చాలెంజింగ్‌గా తీసుకుని న‌టించాను’’ అంటూ బోల్డ్ సీన్స్ సమయంలో తన మానసిక పరిస్థితిని తెలియజేశారు అంజలి.


అంజ‌లి బ‌హిష్క‌ర‌ణ‌లో త‌న పాత్ర గురించి ఇంకా మాట్లాడుతూ ‘‘పుష్ప పాత్రలో బోల్డ్‌గా న‌టించటం కొత్తే అయినా నేను చేస్తున్న పాత్ర‌పై, దాన్నెలా చేయాల‌నే దానిపై నాకు అవ‌గాహ‌న ఉంది. అందువ‌ల్లే ఆ పాత్ర‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆద‌ర‌ణ ద‌క్కింది. నేను ఆ బోల్డ్ సీన్స్‌లో న‌టించేట‌ప్పుడు సెట్స్‌లో చాలా త‌క్కువ మంది మాత్రమే ఉన్నారు. ద‌ర్శ‌కుడు ఆ విష‌యంలో జాగ్ర‌త్త తీసుకున్నారు. అందువ‌ల్ల నేను కంఫ‌ర్ట్‌గా న‌టించ‌గ‌లిగాను’’ అన్నారు. సెట్ లో చాలా తక్కువ మంది ఉన్నారు. ఉన్నవారిని కూడా డైరెక్టర్ బయటకి పంపారు. అందువల్లే కంఫర్టబుల్ గా ఫీల్ అయినట్లు అంజలి తెలిపింది. బహిష్కరణ విడుదలైన మూడు రోజుల్లోనే 35 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను రాబ‌ట్టుకుంది. ముఖేష్ ప్ర‌జాప‌తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సిరీస్‌ను ప్ర‌శాంతి మ‌లిశెట్టి రూపొందించారు. ఈ ఆరు ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ఇప్పుడు జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com