ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న బిగ్ బాస్ బ్యూటీ!

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 27, 2024, 02:10 PM

 బిగ్ బాస్ బ్యూటీ ఇండస్ట్రీలో ఒక సంచలనం. 18 ఏళ్లకే పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు అనేక సవాళ్ళను ఎదుర్కొని నటిగా రాణించారు. సినీ పరిశ్రమలో స్వశక్తితో ఎదిగి  పేరు ప్రఖ్యాతలు సంపాదించిన స్టార్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అలాగే కొందరు నటీనటులు  సినిమాల నుంచి టీవీ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయి బుల్లితెర స్టార్స్ గా రాణిస్తున్నారు. తమకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకుంటున్నారు. సినిమా హీరోయిన్స్ కు మించిన పాపులారిటీ దక్కించుకుంటున్నారు. అలాంటి వారిలో మనం మాట్లాడుకోబోయే నటి కూడా ఒకరు. ఆమె దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న టీవీ నటిగా గుర్తింపు పొందారు. 


ఆమె ఎవరో కాదు హిందీ సీరియల్ నటి శ్వేతా తివారి. హిందీలో అత్యంత ఆదరణ పొందిన ధారావాహిక ' కసౌటి జిందగీ కె ' లో శ్వేతా తివారి ప్రధాన పాత్రలో నటించింది. ప్రేరణ శర్మ క్యారెక్టర్ లో అద్భుతంగా జీవించింది. ఈ సీరియల్ ఏడేళ్ల పాటు సక్సెస్ ఫుల్ గా రన్ అయింది. దీని ద్వారా ఆమెకు గుర్తింపు లభించింది. ఆ తర్వాత హిందీ  బిగ్ బాస్ సీజన్ 4 లో పార్టిసిపేట్ చేసింది. ఆ సీజన్ విన్నర్ గా నిలిచింది. దీంతో ఆమెకు మరింత క్రేజ్ పెరిగింది. ఆ తర్వాత వరుస ఆఫర్లు దక్కించుకుంటూ సీరియల్స్, షోలు చేస్తూ స్టార్ గా ఎదిగింది. శ్వేతా తివారి పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించినప్పటికీ ఆమెకు కలిసి రాలేదు. దీంతో స్మాల్ స్క్రీన్ కి పరిమితం అయింది. కెరీర్ విషయంలో వెనుదిరిగి చూసుకోలేదు. కానీ ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. రెండు సార్లు ప్రేమలో మోసపోయింది. శ్వేతా తివారి  1998 లో నటుడు రాజా చౌదరి ని ప్రేమ వివాహం చేసుకుంది. ప్రస్తుతం శ్వేతా తివారి  కొడుకు, కూతురితో ఒంటరిగా ఉంటున్నారు. అయితే పింక్ విల్లా, మెన్స్ ఎక్స్పీ నివేదిక ప్రకారం ఆమె ఆస్తుల విలువ దాదాపు రూ. 81 కోట్లు అని సమాచారం. అనేక సవాళ్లను అధిగమించి శ్వేతా తివారి పరిశ్రమలో రాణించింది. అనేక మందికి స్ఫూర్తిగా నిలిచింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com