మెగా హీరో సాయిధరమ్ తేజ్ తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో ఒక చిత్రం అనుకున్నప్పటికీ అది అటకెక్కింది. దీనితో సాయి ధరమ్ తేజ్ కెపి రోహిత్ అనే డెబ్యూ డైరెక్టర్ తో భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం ఏకంగా 120 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. విజువల్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న వైవిధ్యమైన కథ అట. పాన్ ఇండియా స్థాయిలో రాణించే సత్తా ఉన్న కథ కావడంతో మేకర్స్ అంత మొత్తం వెచ్చిస్తున్నారు. ఇదిలా ఉండగా తేజు ఈ చిత్రానికి సమాయత్తం అవుతున్నాడు. షాకింగ్ విషయం ఏంటంటే ఈ చిత్రంలో తేజు సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత సాయిధరమ్ తేజ్ బాగా బరువు పెరిగాడు. బరువు తగ్గి సిక్స్ ప్యాక్ లుక్ వచ్చేలా కసరత్తులు చేయబోతున్నాడట. ఆల్రెడీ తేజు డైట్ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత ఇలా హెవీగా వర్కౌట్స్ చేయడం కరెక్టా అంటూ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా తేజు సినిమా కోసం, తన లుక్ మార్చుకోవడం కోసం రిస్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది