సోషల్ మీడియాలో మరియు యూట్యూబ్ లో తప్పుడు వార్తలు, పుకార్లు ప్రచారం చేస్తూ, ట్రోల్స్ పేరుతో అసభ్య వీడియోలను క్రియేట్ చేస్తున్న వారిపై కఠిన చర్యలకు సిద్ధం అవుతున్నట్లుగా మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించిన విషయం తెల్సిందే.మంచు విష్ణు ప్రకటనకు చాలా మంది స్పందించారు.వారందరూ కూడా మంచు విష్ణు నిర్ణయాన్ని సమర్థిస్తూ ప్రకటనలు చేయడం జరిగింది.డిజిటిల్ ప్లాట్ ఫామ్ పై ఉన్న తప్పుడు వార్తలను 48 గంటల్లో తొలగించాల్సిందిగా మంచు విష్ణు ఇచ్చిన మాస్ వార్నింగ్ ను సీనియర్ హీరోయిన్ మీనా కూడా సమర్థించారు.నెగటివ్ కామెంట్స్, సోషల్ మీడియా దాడులను ఎదుర్కొడంలో ఒకరికి ఒకరు మద్దతుగా ఉండాలని మీనా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మీనా తో పాటు ఇంకా ఎంతో మంది మంచు విష్ణు నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు
.