ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిజీబిజీగా "తారక్"

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 31, 2024, 09:12 AM

ఆర్‌ఆర్‌ఆర్‌’ వచ్చి రెండేండ్లు నిండి మూడో ఏడు నడుస్తున్నది. ఇంకా ఎన్టీఆర్‌ నుంచి సినిమా రాలేదు.తారక్‌ మాత్రం ఖాళీగా లేకుండా ఇటు ‘దేవర’తో అటు ‘వార్‌’తో బిజీబిజీగా ఉన్నారు. ఎట్టకేలకు ‘దేవర-1’ షూటింగ్‌ తుదిదశకు చేరుకుంది.రామజోగయ్యశాస్త్రి రాసిన పాటలో ఎన్టీఆర్‌, జాన్వీకపూర్‌లపై ఓ అద్భుతమైన రొమాంటిక్‌ సాంగ్‌ని చిత్రీకరించారు కొరటాల. ఈ పాటను త్వరలోనే మేకర్స్‌ విడుదల చేయనున్నారు.ఈ పాట తంగం అంతరంగం హాయిగ ఉయ్యాలలూగుతున్నట్టుంటుంది.ఇందులో జాన్వికపూర్‌ పాత్ర పేరు ‘తంగం’. ఆమె పేరు మీదే ఈ పాట నడుస్తుందని శాస్త్రి క్లారిటీ ఇచ్చేశారు. తంగం అంటే తమిళంలో బంగారం అని అర్థం. ఏదేమైనా సెప్టెంబర్‌ చివరివారంలో సినిమా విడుదల కానుంది. ఇది హిట్‌ అయిన వెంటనే ‘దేవర 2’ షూటింగ్‌ మొదలవుతుంది. ఇందులో సైఫ్‌అలీఖాన్‌ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com