బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్ ప్రస్తుతం ఉలఝ్ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 'నా జీవితమంతా నటనకే అంకితం. తొలి సినిమా నుంచి ఇప్పటి వరకు ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అలాగే రిస్క్‌తో కూడిన పాత్రలకే ప్రాధాన్యతనిస్తా. అందులో నా నటన చూసి ఆశ్చర్యపోవాలని అనుకుంటాను. ప్రతి సినిమాలో దర్శకుడు కోరుకునేది 100శాతం ఇవ్వడానికి ప్రయత్నిస్తా' అని చెప్పారు.