రాజ్‌తరుణ్ కుటుంబ సభ్యులు మాదాపూర్ పీఎస్‌కు వెళ్లారు. లావణ్య తమ ఇంటికి వచ్చి బెదిరించిందని.. ఇబ్బందులకు గురి చేస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి ఇంటి దగ్గర ఉండగా దాడికి ప్రయత్నించిందని, తమకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని.. ఈ ఫిర్యాదులో తెలిపారు. నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. రాజ్ తరుణ్ పిటిషన్‌ను విచారించిన కోర్టు.. పోలీసుల నుంచి ఆదేశాలు తీసుకోవాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది