వయనాడ్ ప్రాంత బాధితులను ఆదుకునేందుకు పలు చిత్ర పరిశ్రమల నుంచి ఎందరో స్టార్స్ సాయం చేసి అండగా నిలిచారు. అయితే తాజాగా తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ కూడా భారీ విరాళం ప్రకటించారు. కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షలు విరాళంగా అందించారు. చరిత్రలో అత్యంత ఘోరమైన విపత్తుగా ఈ ఘటన మిగిలిపోతుందని కమల్ హాసన్ వ్యాఖ్యానించారు.