హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'మిస్టర్ బచ్చన్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఇటీవలే చిత్ర బృందం ఈ యాక్షన్ డ్రామా ట్రైలర్ ని విడుదల చేసారు. తాజగా ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో టాప్ ట్రేండింగ్ లో ఉన్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ సినిమా ఆగస్ట్ 15న విడుదల కానుంది. ఈ చిత్రం అజయ్ దేవగన్ యొక్క సూపర్ హిట్ రైడ్యొ క్క అధికారిక రీమేక్. రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్స్ నటిస్తుంది. ఈ చిత్రం నిజాయితీ గల ఆదాయపు పన్ను అధికారి మిస్టర్ బచ్చన్గు రించి. ఈ చిత్రం పారిశ్రామికవేత్త సర్దార్ ఇందర్ సింగ్‌పై భారతదేశం యొక్క సుదీర్ఘ ఆదాయపు పన్ను దాడి ఆధారంగా రూపొందించబడింది. టిజి విశ్వ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.