శోభిత ధూళిపాళ్ల ఏపీలోని తెనాలికి చెందినది. 1992 మే 31న జన్మించింది. శోభిత తండ్రి వేణుగోపాల్ రావు ఒక నేవీ ఇంజినీర్. తల్లి శాంతా కామాక్షి ప్రైమరీ స్కూల్ టీచర్. విశాఖపట్నంలో పెరిగిన శోభిత 16 ఏళ్ల వయసులో తండ్రి వృత్తి రీత్యా ముంబైకి వెళ్లాల్సి వచ్చింది. శోభిత ముంబై యూనివర్సిటీలో కార్పొరేట్ లా చేసి.. భరతనాట్యం, కూచిపూడి నేర్చుకుంది. 2010లో జరిగిన నేవీ వార్షిక వేడుకల్లో నేవీ క్వీన్ కిరీటం సాధించింది శోభిత.