ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీరామ్ హీరోగా తెర‌కెక్క‌నున్న ఎర్ర చీర!

cinema |  Suryaa Desk  | Published : Tue, May 28, 2019, 08:46 PM

ప్రముఖ నటుడు శ్రీరామ్, కమెడియన్ అలీ నటిస్తున్న తాజా చిత్రం ఎర్ర చీర. సుమన్ బాబు ఈ చిత్రానికి దర్శకుడు. శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ నెల 25న రెండవ షెడ్యూల్ పూర్తి చేశాం అని చిత్ర యూనిట్ తెలిపారు. సిటీ నేపథ్యంలో ఆసక్తికరమైన సన్నివేశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. రెండవ షెడ్యూల్ లో భాగంగా శ్రీరాంపై యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించినట్లు తెలిపారు.
ఈ చిత్రంలో ఛేజింగ్ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయని దర్శకుడు వివరించాడు. సీనియర్ కమెడియన్ అలీ నటించిన సన్నివేశాలు కడుపుబ్బా నవ్వించేలా ఉంటాయని దర్శకుడు తెలిపారు. ముఖ్యంగా హర్రర్ సన్నివేశాల్లో అలీ నటన మెప్పించే విధంగా ఉంటుందని తెలిపారు.
ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మంచి నిర్మాణవిలువలతో తెరెక్కిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సతీష్ తెలిపారు. ఆగష్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటివారంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకునివచ్చేలా సన్నాహకాలు చేస్తున్నట్లు ప్రకటించారు. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa