వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని ఒక సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'సరిపోద శనివారం' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా కెనడా రైట్స్ ని ది విలేజ్ గ్రూప్ సొంతం చేసుకున్నాయి. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ ఆయ్యినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సాయికుమార్, అభిరామి, మురళి శర్మ, అజయ్, హర్షవర్ధన్, సుధాకర్, సుప్రీత్ రెడ్డి,అదితి బాలన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 29, 2024న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు సిద్ధమవుతోంది. డివివి ఎంటర్టైన్మెంట్పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ యాక్షన్ డ్రామాకు జేక్ బెజోయ్ సంగీత దర్శకుడు.