స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ వార్తల్లోకి వచ్చారు. నాగ చైతన్యతో విడాకుల తర్వాత నటి సమంత మళ్లీ లవ్లో పడినట్టు తెలుస్తోంది. 'ది ఫ్యామిలీ మ్యాన్' దర్శకుడు రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. వారి డేటింగ్ పుకార్లు మొదట రెడ్డిట్లో వచ్చాయి. ప్రస్తుతం నెట్టింట దీనిపైనే చర్చ జరుగుతోంది. సమంత, రాజ్ 'సిటాడెల్: హనీ బన్నీ'లో కూడా కలిసి పనిచేశారు.