స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏపి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కూతురు ఆద్యతో సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫొటోను రేణూ దేశాయ్ తన ఇన్స్టాలో షేర్ చేస్తూ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. 'తన నాన్నతో సమయం గడుపుతానని ఆద్య నన్ను అడగ్గానే సంతోషమేసింది. ఉన్నత వ్యక్తుల జీవితం ఆమె చూడాలనుకోవడంతో ఆనందం కలిగింది. ప్రజలకు వాళ్ల నాన్న చేసే సేవలను ఆద్య అర్థం చేసుకుంది' అంటూ ఆమె రాసుకొచ్చారు