మహర్షి చిత్ర విజయంతో మంచి జోష్‌మీదున్న మహేష్ బాబు తన 26వ చిత్రాన్ని అనీల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు, అనీల్ సుంకర నిర్మాణంలో రూపొందనున్న ఈ చిత్రంపై అభిమానులలో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. కొద్ది రోజులుగా చిత్రానికి సంబంధించి వస్తున్న వార్తలు అభిమానులలో ఆనందాన్ని కలుగజేస్తున్నాయి. ఈ చిత్రానికి ‘సరిలేరు నీకెవ్వరూ’ , రెడ్డిగారి అబ్బాయి అనే టైటిల్స్‌లోఒకటి ఫిక్స్ చేస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి. కృష్ణ బర్త్‌డే సందర్భంగా చిత్ర టైటిల్ రివీల్ చేసింది చిత్ర బృందం. ‘సరిలేరు నీకెవ్వరూ’ అనే టైటిల్‌ని మూవీకి ఫిక్స్ చేస్తూ టైటిల్ లోగో విడుదల చేసింది. ఈ రోజు ఉదయం 9:18ని.లకి చిత్రాన్ని లాంచ్ చేయనున్నట్టు సమాచారం. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు జగపతి బాబు విలన్ రోల్ లో నటించనుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనుంది.సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఈ సినిమాలో మహేష్‌ని సరికొత్త లుక్‌లో చూపించనున్నాడు దర్శకుడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa