ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనసూయ పోస్ట్ పై నెటిజన్స్‌ ట్రోల్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 22, 2024, 02:48 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా పరిచయమైన అనసూయ హాట్ బ్యూటీగా పేరు సంపాదించుకుంది.అతి తక్కువ సమయంలోనే ప్రతి ఒక్క ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి అనసూయ అతి తక్కువ సమయంలోనే సినిమాల్లోనూ అవకాశాలను దక్కించుకుంది.ఇక జబర్దస్త్ వంటి షోలకు గుడ్ బై చెప్పేసి వరుసపెట్టి సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది. ఎంతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాలను, ఫోటోలను షేర్ చేసుకుంటూ తన ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో వరుస పెట్టి ఫోటోషూట్లు చేస్తూ తన అభిమానులను ఆకట్టుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.


సమయం దొరికినప్పుడల్లా అనసూయ తన కుటుంబ సభ్యులతో కలిసి వెకేషన్ కి వెళుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అక్కడ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ ట్రోలింగ్ కు గురవుతూ ఉంటుంది. ఈ క్రమంలోని అనసూయ తాజాగా తన ఇంటి ముందు షటిల్ ఆడుతూ కనిపించింది. వర్షం పడిన సమయంలో తన భర్తతో కలిసి షటిల్ ఆడింది. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఇన్ స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. షటిల్ ఆడడమే కాకుండా తన భర్తను రొమాంటిక్ గా టచ్ చేస్తూ ఫోటోలు దిగింది.


ఈ ఫోటోలు, వీడియోలను చూసిన నెటిజెన్లు పలు రకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. భర్తతో కలిసి రోడ్డు మీద వర్షంలో షటిల్ ఆడడం అవసరమా....రొమాంటిక్ గా ముట్టుకోవడం ఎందుకు అని నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొంతమంది అనసూయ అభిమానులు అనసూయకు సపోర్ట్ గా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అనసూయ షేర్ చేసుకున్నటువంటి ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.


 


 












SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com