సూపర్‌నేచురల్ హారర్ థ్రిల్లర్ డీమోంటే కాలనీ 2 సినిమాలో అరుళ్నితి, ప్రియా భవాని శంకర్ మరియు అర్చన రవిచంద్రన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఆగష్టు 15న విడుదలైంది. ఈ చిత్రానికి అభిమానులు మరియు విమర్శకుల నుండి సానుకూల స్పందన వచ్చింది. ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ ఆగస్ట్ 23న విడుదల కానుంది. ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ నైజాం రైట్స్ ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్ ని ఈరోజు ప్లాన్ చేసినట్లు ప్రకటించారు. ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్ లు వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, కడప, కాకినాడ, అనంతపూర్ లో నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా థియేటర్ లిస్ట్ ని కూడా విడుదల చేసింది చిత్ర బృందం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఇప్పటికే ఈ సినిమా బుకింగ్స్ ని కూడా చిత్ర బృందం ఓపెన్ చేసింది. ఈ సీక్వెల్‌కు ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. జ్ఞానముత్తు పట్టరై మరియు వైట్ నైట్స్ ఎంటర్టైన్మెంట్తో కలిసి BTG యూనివర్సల్ బ్యానర్‌పై బాబీ బాలచంద్రన్ ఈ సినిమాని నిర్మించారు.