ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'లగ్గం' టీజర్ విడుదల ఎప్పుడంటే...!

cinema |  Suryaa Desk  | Published : Sat, Aug 24, 2024, 03:40 PM

సుబిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వేణు గోపాల్ రెడ్డి నిర్మించిన భారీ అంచనాల చిత్రం "లగ్గం" కి రమేష్ చెప్పాల రచించి, దర్శకత్వం వహించారు. ఈ కల్చరల్ ఫ్యామిలీ డ్రామా మెమరబుల్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌గా ఉంటుందని భావిస్తున్నారు. ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రం పట్ల తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ, లగ్గం అనేది ప్రతి ఒక్కరికీ చర్చనీయాంశం అవుతుంది. ఈ చిత్రం సరికొత్త అనుభూతిని అందిస్తూ తరతరాలకు గుర్తుండిపోతుంది అని అన్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న 'లగ్గం' పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క టీజర్ ని ఆగష్టు 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. చరణ్ అర్జున్ సంగీతం అందించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో సాయి రోనక్ మరియు ప్రజ్ఞా నగ్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, రోహిణి, సప్తగిరి, ఎల్బీ శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రాచ రవి, కనకవ్వ, వడ్లమాని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చంద్ర, చిత్రమ్ శీను, సంధ్యా గంధం, టి.సుగుణ, లక్ష్మణ్ మీసాల, ప్రభావతి, కంచెరపాలెం రాజు, ప్రభాస్ శ్రీను, సత్య ఏలేశ్వరం, అంజి బాబు, ఆర్ ఎస్ నంద, కిరీటి ఈ చిత్రంలో కీలక పత్రాలు నటిస్తున్నారు. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందించారు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్, బాల్ రెడ్డి సినిమాటోగ్రాఫర్, కృష్ణ ఆర్ట్ డైరెక్టర్ గా ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa