ప్రస్తుతం ఓటీటీలో పలు సూపర్ హిట్ లు ఉన్నాయి. గత వారం రిలీజైన ప్రభాస్ కల్కి, ధనుష్ రాయన్ పైనే అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే బాలీవుడ్ సూపర్ హిట్ కామెడీ హారర్ ఫిల్మ్ ముంజ్యా కూడా ఓటీటీ ఆడియెన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే వీటన్నింటి మధ్య ఒక క్యూట్ లవ్ స్టోరీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అదే ప్రభుత్వ జూనియర్ కళాశాల. శ్రీనాథ్ పులకురం తెరకెక్కించిన ఈ విలేజ్ లవ్ డ్రామాలో అందరూ కొత్త వాళ్లే నటించడం విశేషం. ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రభాస్ 'కల్కి' థియేటర్లలో రిలీజ్ కావడానికి వారం ముందు అంటే జూన్ 21న ప్రభుత్వ జూనియర్ కళాశాల థియేటర్లలోకి అడుగు పెట్టింది. అయితే చిన్న కావడం, ప్రమోషన్లు పెద్దగా చేయకపోవడంతో ఈ ను ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఈ కు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. థియేటర్లలో పెద్దగా సందడి చేయని ఈ విలేజ్ లవ్ స్టోరీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా. ప్రభుత్వ జూనియర్ కళాశాల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఆహా లో స్ట్రీమింగ్ అవుతుంది.