వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని ఒక సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'సరిపోద శనివారం' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రం యొక్క గ్లింప్స్ మరియు టీజర్లకు అభిమానులు మరియు విమర్శకుల మధ్య సంచలనం సృష్టించింది. ఈ సినిమా మాస్ ఎంటర్టైనర్గా సెట్ చేయబడింది. ఈ సినిమా ట్రైలర్ ఈ మూవీ పై భారీ అంచనాలని నెలకొల్పింది. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రొమోషన్స్ ని ప్రారంభించారు. "దసరా" మరియు "హాయ్ నాన్న" వరుసగా రెండు బ్లాక్ బస్టర్ల తరువాత, వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన "సరిపోదా శనివారం"తో నాని తన విజయాన్ని 2024లో కొనసాగించడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ట్రిపుల్ ది ఫన్ అనే ఇంటర్వ్యూ ని చేసారు. ఈ ఇంటర్వ్యూలో నాని, సూర్య, ప్రియాంక మోహన్ సినిమా గురించిన విషయాలని చర్చించారు. ఈ వీడియోని విడుదల చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 29, 2024న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో సాయికుమార్, అభిరామి, మురళి శర్మ, అజయ్, హర్షవర్ధన్, సుధాకర్, సుప్రీత్ రెడ్డి, అదితి బాలన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ యాక్షన్ డ్రామాకు జేక్ బెజోయ్ సంగీత దర్శకుడు. డివివి ఎంటర్టైన్మెంట్పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు.