హీరో కిరణ్ అబ్బవరం ఇటీవల ఆగస్టు 22న రహస్య గోరఖ్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి సినిమాతో పరిచయం అయిన కిరణ్, రహస్య ప్రేమించుకొని పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.కిరణ్ అబ్బవరం - రహస్య గోరఖ్ పెళ్లి ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. పెళ్లి కర్ణాటక లోని కూర్గ్ లో జరిగింది.అయితే తాజాగా నిన్న కిరణ్ అబ్బవరం - రహస్య రిసెప్షన్ వేడుకలు కిరణ్ సొంతూరు రాయచోటిలోని పెద కోడివాండ్ల పల్లిలో జరిగింది. తన ఊళ్ళో ఓ మామిడి తోటలో చెట్ల కింద రిసెప్షన్ వేడుకలను అరేంజ్ చేసాడు కిరణ్ అబ్బవరం. కిరణ్ బంధువులతో పాటు సన్నిహితులు, ఊర్లో జనాలకు భోజనాలు పెట్టాడు కిరణ్. కిరణ్ - రహస్య రిసెప్షన్ వేడుకలకు వెళ్లిన పలువురు ఫోటోలు, వీడియోలు షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.