ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిజిటల్ పార్టనర్ ని లాక్ చేసిన 'సరిపోదా శనివారం'

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 29, 2024, 02:47 PM

"దసరా" మరియు "హాయ్ నాన్న" వరుసగా రెండు బ్లాక్ బస్టర్ల తరువాత, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన 'సరిపోద శనివారం' చిత్రం ఆగస్ట్ 29, 2024న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాపై ఉన్న హైప్‌ని క్యాష్ చేసుకోవడానికి మేకర్స్ ఎర్లీ మార్నింగ్ షోలను ఏపీ, తెలంగాణ అంతటా షెడ్యూల్ చేశారు. ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ సినిమా విడుదలైన అని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ఫారం నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను 45 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రంలో సాయికుమార్, అభిరామి, మురళి శర్మ, అజయ్, హర్షవర్ధన్, సుధాకర్, సుప్రీత్ రెడ్డి, అదితి బాలన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్‌పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ యాక్షన్ డ్రామాకు జేక్ బెజోయ్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com