త్వరలో నటుడు నాగచైతన్య.. నటి శోభిత ధూళిపాళ వివాహ బంధంతో ఒక్కటికానున్నారు. కాగా, చైతు తన వివాహ ప్రణాళికలపై ఇటీవల ఓ కార్యకమంలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. "పెళ్లి గ్రాండ్ గా చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ నాకు అత్యంత సన్నిహితుల మధ్యలో సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం జరగాలి" అని ఆయన చెప్పారు. పెళ్లి తేదీలు, వెన్యూ గురించి త్వరలో ప్రకటిస్తామన్నారు. 2022 వేసవి నుంచే చైతన్య-శోభిత ప్రేమలో ఉన్నారని సమాచారం.