ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మెయ్యళగన్' తెలుగు వెర్షన్ టైటిల్ ఖరారు

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 09, 2024, 04:37 PM

సి. ప్రేమ్ కుమార్‌ దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు కార్తీ తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం చేయడమే కాకుండా, ప్రేమ్ కుమార్ ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే మరియు డైలాగ్‌లు రాశారు. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'మెయ్యళగన్' అనే టైటిల్‌ ని లాక్ చేసారు. అరవింద్ స్వామి కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా తెలుగు వెర్షన్ టైటిల్ ని ప్రకటించారు. ఈ చిత్రానికి తెలుగులో 'సత్యం సుందరం' అనే టైటిల్ ని లాక్ చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో రాజ్‌కిరణ్, శ్రీ దివ్య, స్వాతి కొండే, దేవదర్శిని, జయప్రకాష్, శ్రీ రంజని, ఇళవరసు, కరుణాకరన్, శరణ్, రేచల్ రెబెక్కా, ఆంథోని, రాజ్‌కుమార్, ఇందుమతి, రాణి సంయుక్త, కాయల్ సుబ్రమణి, అశోక్ పాండియన్, తదితరులు కీలక పాత్రలలో నటించారు. గోవింద్ వసంత ఈ సినిమాకి స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడుదల కానుంది. 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌పై జ్యోతిక మరియు సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, రాజశేఖర్ కర్పూరసుందరపాండియన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com