టాలీవుడ్ స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై ఆరోపణలు చేస్తూ నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీనిపై తాజాగా దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ‘‘ఆమె ‘మా’కు ఫిర్యాదు ఎందుకు చేసిందో, ఏ సంవత్సరంలో చేసిందో మాకు తెలియదు. అప్పటికి కమిటీ ఏర్పాటై ఉంటే.. ఫిర్యాదు బాక్స్‌లో తన ఫిర్యాదు వేసి ఉంటే సరిపోయేది. కంప్లైంట్ లేకుండా మనం ముందుకెళ్లలేం’’ అని తెలిపారు.