రోహిత్ శెట్టి దర్శకత్వంలో అజయ్ దేవగన్ ఒక చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'సింఘం ఎగైన్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రంలో ప్రభాస్ మరియు కోలీవుడ్ స్టార్ సూర్య అతిథి పాత్రలో కనిపించవచ్చని ఊహాగానాలు ఉన్నాయి. తాజాగా ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకున్నట్లు సమాచారం. సింఘం ఎగైన్ అనేది ప్రముఖ సింఘం ఫ్రాంచైజీలో మూడవ చిత్రం మరియు అక్షయ్ కుమార్, కరీనా కపూర్ ఖాన్, రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనే మరియు టైగర్ ష్రాఫ్ ఈ హై ఆక్టేన్ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమాని మొదట ఆగస్ట్‌లో విడుదల చేయాలనుకున్నారు. VFX మరియు ఇతర నిర్మాణ కారకాల కారణంగా ఈ చిత్రం ప్రారంభోత్సవం ఈ సంవత్సరం దీపావళికి వాయిదా పడింది. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలని మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.