ఇప్పటికే రెండు సినిమాల్లో నటిస్తూ హీరోగా బిజీగా ఉన్నాడు శర్వానంద్. తాజాగా మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. శర్వానంద్ హీరోగా మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబోలో ఓ మూవీ రాబోతోందిగురువారం ఈ సినిమాను ఆఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు.1960 టైమ్ పీరియడ్‌లో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. నార్త్ తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నేపథ్యంలో సంపత్ నంది ఈ కథను రాసుకున్నట్లు తెలిసింది. భయంతో నిండిన ఓ ప్రాంతంలోని అనేక ప్రశ్నలకు ఓ యువకుడు సృష్టించిన రక్తపాతం ఎలా సమాధానాలు చెప్పిందనే పాయింట్‌తో సంపత్ నంది ఈ మూవీని తెరకెక్కిస్తోన్నట్లు చెబుతోన్నారు
ఇందులో శర్వానంద్ 1960ల కాలం నాటి ఓ యువకుడిగా కనిపించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ రోల్ కోసం శర్వానంద్ కంప్లీట్ మేకోవర్ అవుతోన్నట్లు తెలిసింది. అతడి లుక్, బాడీలాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఉండబోతున్నట్లు సమాచారం. గురువారం రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్ ఆసక్తిని పంచుతోంది.శర్వానంద్ హీరోగా నటిస్తోన్న 38వ మూవీ ఇది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తోన్నాడు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై కేకేరాధామోహన్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తోన్నాడు. పాన్ ఇండియన్ లెవెల్లో రూపొందుతోన్న ఈ మూవీని తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.