హీరోయిన్ త్రిషపెళ్లి చేసుకోబోతుందంటే చాలామంది అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు... కానీ ఇప్పటివరకు అయితే అభిమానులు కోరుకున్నది జరగడం లేదు.అయితే గతంలో ఒక సెన్సేషనల్ న్యూస్ చాలామంది నోళ్లలో నానింది. అదేంటంటే..ఓ హీరో తో త్రిష రహస్య ఎంగేజ్మెంట్ చేసుకుందని.ఈ విషయం బయటపడడంతో ఆ హీరో తండ్రి వార్నింగ్ ఇచ్చారు అంటూ చాలామంది త్రిష గురించి గుసగుసలు పెట్టుకున్నారు.మరి ఇంతకీ ఆ హీరో ఎవరు..నిజంగానే డైమండ్ రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేసి ఎంగేజ్మెంట్ చేసుకున్నారా అనేది ఇప్పుడు చూద్దాం.. సౌత్ బ్యూటీత్రిష కి ఇప్పటికే ప్రభాస్,రానా, విజయ్, ధనుష్, వరుణ్ మానియన్, సిద్ధార్థ్ వంటి వారితో డేటింగ్ వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే అలాంటి త్రిష ప్రస్తుతం విజయ్ ని రెండో పెళ్లి చేసుకోబోతుందనే రూమర్ కూడా మీడియాలో వైరల్ గా మారుతుంది.
ఇలాంటి నేపథ్యంలోనే త్రిష గురించి ఓ షాకింగ్ విషయం బయటపడింది.అదేంటంటే త్రిష గతంలోనే ఓ హీరోతో ఎంగేజ్మెంట్ చేసుకుందని..ఇక విషయంలోకి వెళ్తే.. త్రిషవిజయ్ మధ్య ఏదో నడుస్తోందనే అనుమానం ప్రతి ఒక్కరిలో ఉంది. అయితే గతంలో విజయ్,త్రిషలు ఎంతో గాఢంగా ప్రేమించుకున్నారట. ఇక త్రిషని పెళ్లి చేసుకునే ఉద్దేశంతోనే విజయ్ ఆమె పుట్టిన రోజు నాడు ఓ ఫైవ్ స్టార్ హోటల్ బుక్ చేసి అందులో గ్రాండ్ గా పార్టీ కూడా ఇచ్చారట.
ఇక అదే పార్టీలో డైమండ్ రింగ్ ఇచ్చి త్రిషకి ప్రపోజ్ చేసి ఆ రింగ్ ని ఆమె వేలికి తొడగడంతో ఇది కాస్త మీడియాలో వైరల్ అయ్యి వీరిద్దరూ రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు అనే మ్యాటర్ చక్కర్లు కొట్టింది. దీంతో కోలీవుడ్ మొత్తం ఈ వార్త వ్యాపించడంతో ఈ విషయం తెలిసిన విజయ్ తండ్రి కోప్పడి ఇద్దరినీ మందలించి అప్పటినుండి వీరిద్దరిని సినిమాల్లో కలిసి నటించకుండా జాగ్రత్తలు తీసుకున్నారట. అలా అప్పట్లో వచ్చిన ఈ రూమర్ లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం విజయ్త్రిష ల వ్యవహారం చూస్తే అది నిజమే కావచ్చు అనుకుంటున్నారు