మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన 'గద్దలకొండ గణేష్' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన తమిళమ్మాయి మృణాళిని రవి.'గద్దలకొండ గణేష్' తర్వాత 'ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు', 'మామా మశ్చీంద్ర' సినిమాలు చేశారు మృణాళిని. ఆ తర్వాత తమిళ సినిమాలకు పరిమితం అయ్యారు.అందులో అథర్వకు జోడీగా కనిపించారు. తండ్రితో మృణాళిని రవి. ఆమె కొత్త ఇంటికి 'మౌళి ఇల్లం' (మౌళి ఇల్లు) అని పేరు పెట్టారు. దీని వెనుక ఒక కథ ఉంది. అది ఏమిటంటే... తన బాల్యంలో తండ్రి ఇల్లు కట్టినప్పుడు దానికి ఆయన అమ్మ (నాయనమ్మ) పేరు పెట్టారని, ఏదో ఒక రోజు తాను ఇల్లు కట్టి దానికి మా అమ్మ పేరు పెట్టుకోవాలని కల కన్నానని, ఆ కల ఇప్పటికి నెరవేరిందని ఆమె తెలిపారు.మృణాళిని రవి పర్సనల్ లైఫ్ లో లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఆవిడ కొత్త ఇల్లు కొనుక్కున్నారు. గృహ ప్రవేశం కూడా చేశారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.కొత్తింటి గృహప్రవేశంలో తల్లిదండ్రులు, తమ్ముడితో కలిసి పూజలు నిర్వహిస్తున్న మృణాళిని రవి.