టాక్సీవాలా సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ప్రియాంకా జవాల్కర్ . 2018లో విజయ్‌దేవరకొండతో కలిసి నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా..ప్రియాంకా జవాల్కర్‌కు మాత్రం మంచి ఫ్యాన్ బేస్ సంపాదించి పెట్టింది. ఆ తర్వాత ఎస్ఆర్ కల్యాణ మండపం సినిమాతో మంచి బ్రేక్ అందుకుంది. 2024లో టిల్లు 2తో మెరిసిన ఈ బ్యూటీ కొత్త సినిమా ప్రకటించాల్సి ఉంది.ఈ భామ ప్రస్తుతం స్టైలిష్‌గా ప్రెట్టీ ఉమెన్ అవతార్‌లోకి మారిపోయిన లుక్స్ నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. ఇంతకీ ఈ బ్యూటీ ఎక్కడికెళ్లిందనే కదా మీ డౌటు. పాపులర్ సిటీ న్యూయార్క్. ఎడ్వర్డ్ : యువరాణి ఓ గుర్రం ద్వారా రక్షించబడిన తర్వాత ఏమి జరుగుతుంది? వివియన్ : ఆమె వెంటనే అతన్ని రక్షించింది! ప్రెట్టీ ఉమెన్ సినిమా నుండి.. మీరు చూశారా? అంటూ క్యాప్షన్ ఇచ్చింది ప్రియాంకా జవాల్కర్.
ప్రియాంకా జవాల్కర్ బ్లాక్ టాప్, సిల్వర్ జాకెట్ మ్యాచింగ్ ప్యాంట్స్‌లో స్టైలిష్‌గా కనిపిస్తూ నెటిజన్లకు కంటి మీద కునుకు లేకుండాచేస్తోంది. ఐకానిక్ స్ట్రీట్స్ మనహట్టన్ వీధుల్లో కెమెరాకు స్టన్నింగ్ ఫోజులిస్తూ దిగిన ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి మరి.