శివ కోరటాల దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'దేవర' అనే టైటిల్ ని లాక్ చేసారు. 2024లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాలలో "దేవర: పార్ట్ 1" ఒకటి. ఈ చిత్రం సెప్టెంబర్ 27న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా సాంగ్స్ మరియు ట్రైలర్ మూవీ పై భారీ హైప్ ని క్రియేట్ చేసాయి. తాజాగా ఇప్పుడు ఈ చలనచిత్రం యొక్క మొత్తం రన్టైమ్ 2 గంటలు 50 నిమిషాలు మరియు 58 సెకన్లు అని ఇప్పుడు అధికారికంగా వెల్లడయ్యింది. ఇందులో చట్టబద్ధమైన హెచ్చరికలు, అలాగే ప్రారంభ మరియు ముగింపు క్రెడిట్లు ఉన్నాయి. ఇవి లేకుండా అసలు రన్టైమ్ 2 గంటల 42 నిమిషాలు ఉంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తారక్ పొన్నప, శృతి మురాతి, వంశి, శ్రీను, హిమజ కీలక పాత్రలో నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న "దేవర: పార్ట్ 1" ఎపిక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్గా నిలుస్తుంది. యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.